కొంటె నవ్వే ఇలా.. చంపుతుంటే ఎలా

నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘కోలా కళ్లే ఇలా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే విడుదలైన ఈ పాట ప్రోమో విశేష ఆదరణ పొందింది. తాజాగా వచ్చిన లిరికల్‌ వీడియో సైతం  సంగీత ప్రియుల్ని అలరిస్తోంది.

Published : 14 Feb 2021 17:36 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘కోలా కళ్లే ఇలా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే విడుదలైన ఈ పాట ప్రోమో విశేష ఆదరణ పొందింది. తాజాగా వచ్చిన లిరికల్‌ వీడియో సైతం  సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: గణేశ్‌ కుమార్‌ రావూరి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రం మే లో విడుదల కానుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చిన ఈ మెలొడీని మీరూ వినేయండి.

ఇదీ చదవండి..

బిగ్‌బాస్‌ ఫేం మోనల్‌-అఖిల్‌ కొత్త సినిమా ఇదే!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని