Lakshmi Manchu: మంచు లక్ష్మి ఇంటిని చూశారా?

మోహన్‌బాబు తనయగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి.. వ్యాఖ్యాతగా, నటిగా

Published : 12 Aug 2021 01:26 IST

హైదరాబాద్‌: మోహన్‌బాబు తనయగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి.. వ్యాఖ్యాతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’తో ప్రతినాయకురాలు ఐరేంద్రిగా నటించి అందరి ప్రశంసలూ అందుకోవడమే కాదు, ఉత్తమ విలన్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటారు. తన కుమార్తెతో కలిసి వీడియోలను, ఫొటోలను పంచుకుంటారు. వ్యాయామాలు, యోగా ఇలా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటారు. తాజాగా తన ఇంటి గురించి విశేషాలు పంచుకున్నారు. ‘మై హోమ్‌ టూర్‌’ అంటూ తన ఇల్లు ఏవిధంగా ఉంటుంది? ఆఫీస్‌ ఎలా ఉంటుంది? సినిమాలు ఎక్కడ చూస్తారు? తన వార్డురోబ్‌లో ఏమేం వస్తువులు ఉంటాయో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం ‘చలో మంచు లక్ష్మి ఇంటికి’..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని