Malavika Sharma: గోపీచంద్‌కు జోడీగా..

ఇటీవలే ‘రామబాణం’ సినిమాతో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు గోపీచంద్‌. ఇప్పుడు కన్నడ దర్శకుడు ఎ.హర్షతో ఓ చిత్రం చేస్తున్నారు.

Updated : 26 May 2023 14:53 IST

ఇటీవలే ‘రామబాణం’ సినిమాతో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు గోపీచంద్‌. ఇప్పుడు కన్నడ దర్శకుడు ఎ.హర్షతో ఓ చిత్రం చేస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ సినిమా కోసం కథానాయికగా మాళవిక శర్మను ఖరారు చేసినట్లు సమాచారం. రవితేజ ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాళవిక.. ఆ వెంటనే రామ్‌తో కలిసి ‘రెడ్‌’ చిత్రంలో సందడి చేసింది. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించని ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ గోపీచంద్‌ సినిమాతో తెలుగులోకి తిరిగి రానుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిసింది. ఇది గోపీచంద్‌కు 31వ సినిమా. కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని