Mehreen: ‘స్పార్క్‌’ మొదలైంది

విక్రాంత్‌ కథానాయకుడిగా డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘స్పార్క్‌’. మెహ్రీన్‌ కథానాయిక. అరవింద్‌ కుమార్‌ రవివర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

Updated : 09 May 2022 14:09 IST

విక్రాంత్‌ కథానాయకుడిగా డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘స్పార్క్‌’. మెహ్రీన్‌ కథానాయిక. అరవింద్‌ కుమార్‌ రవివర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ రంజిత్‌కుమార్‌ రెడ్డి,  దర్శకుడు సురేందర్‌రెడ్డి, ఛాయాగ్రాహకుడు రత్నవేలు, పారిశ్రామికవేత్త రామరాజుతోపాటు అన్వేష్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ‘‘రత్నవేలు దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన అరవింద్‌కుమార్‌ రవివర్మ... శంకర్‌, సుకుమార్‌ల దగ్గర సినిమాలు చేసి దర్శకత్వ మెలకువల్ని నేర్చుకున్నారు. ప్రకటనలు చేసిన అనుభవం ఉంది. వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తార’’ని సినీ వర్గాలు తెలిపాయి. వెన్నెల కిషోర్‌, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మ  నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని