Monica O My Darling: మోనికా ఓ మై డార్లింగ్‌ అంటున్న రాజ్‌కుమార్‌ రావ్‌

రాజ్‌కుమార్‌ రావు, రాధికా ఆప్టే, హ్యూమాఖురేషి కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ ‘మోనికా, ఓ మై డార్లింగ్‌’.

Published : 31 Oct 2022 16:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజ్‌కుమార్‌ రావు, రాధికా ఆప్టే, హ్యూమాఖురేషి కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ ‘మోనికా, ఓ మై డార్లింగ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 11న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. హత్య చుట్టూ ఆసక్తికర కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? అది రాజ్‌కుమార్‌ రావు మెడకు ఎలా చుట్టుకుంది? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని