ఆహాలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. ట్రైలర్‌ చూశారా?

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.

Published : 16 Nov 2021 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. అక్టోబరు 15న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలని నమ్మే వ్యక్తి (హర్ష)గా అఖిల్‌, స్టాండప్‌ కమెడియన్‌ (విభావరి)గా పూజా హెగ్డే కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పంచేలా, భావోద్వేగ భరితంగా సాగిన ట్రైలర్‌ మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని