Nani: నాని-వివేక్ ఆత్రేయల కాంబోలో మరో సినిమా.. టైటిల్‌ ఇదేనా!

దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నవ్వులు పూయించడానికి నాని మరోసారి సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

Published : 21 Oct 2023 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు హీరో నాని (Nani). ‘అంటే సుందరానికి’ అంటూ వివేక్ ఆత్రేయతో కలిసి గతంలో నవ్వులు పూయించిన ఆయన మరోసారి ఆ దర్శకుడితో కలిసి సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర టైటిల్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొదటినుంచి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమాల పేర్లన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ‘మెంటల్‌ మదిలో’, ‘అంటే సుందరానికి’ అంటూ టైటిల్‌తోనే ఆయన ఆసక్తికలిగిస్తారు. ఇప్పుడీ సినిమాకు కూడా ‘సరిపోదా శనివారం’ అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇక ఇందులో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అలాగే అక్టోబర్‌ 24 నుంచి దీని షూటింగ్‌ మొదలుకానుంది. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

మహాభారతంపై వివేక్ అగ్నిహోత్రి సినిమా.. ఎన్ని భాగాలంటే!

ఇక ప్రస్తుతం నాని ‘హాయ్‌ నాన్న’ (Hai Nanna)లో నటిస్తున్నారు. శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నారు. మృణాల్ ఠాకూర్‌ కథానాయిక. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇదే పేరుతో రానుండగా.. హిందీలో మాత్రం ‘హాయ్‌ పాపా’ పేరుతో విడుదల కానుంది.ఈ చిత్రం డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని