Vivek Agnihotri: మహాభారతంపై వివేక్ అగ్నిహోత్రి సినిమా.. ఎన్ని భాగాలంటే!

వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను ప్రకటించారు. మహాభారతం ఆధారంగా ఇది తెరకెక్కనుంది.

Published : 21 Oct 2023 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తన తర్వాతి సినిమాను ప్రకటించారు. మహాభారతం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ తన ఎక్స్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు.

కన్నడ రచయిత ఎన్‌.ఎల్‌.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని వివేక్‌ అగ్నిహోత్రి సినిమా రూపంలో అందించనున్నారు. ఇప్పటికే దీనిని పలు ప్రముఖ భాషల్లో అనువదించారు. ఇదే విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి తన ఎక్స్‌లో ప్రకటించారు. తన సినిమాకు ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా మూడు భాగాలుగా రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

ఓ ఆడబిడ్డా.. జర పైలం.. భగవంత్‌ కేసరి చెప్పిన ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం

ఇక వివేక్ అగ్నిహోత్రి తాజాగా ‘ది వ్యాక్సిన్‌ వార్’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రం స్క్రిప్ట్ ఆస్కార్‌ లైబ్రెరీలో శాశ్వత స్థానం సొంతంచేసుకుంది. కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నానా పటేకర్‌, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషి, సప్తమి గౌడ, రైమా సేన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని