Naresh- Pavitra : నరేశ్ - పవిత్రల పెళ్లి వీడియో.. ప్రచారమా..? నిజమా..?
సినీ నటుడు నరేశ్ (Naresh) తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఇది సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్: సీనియర్ నటుడు నరేశ్ (Naresh) శుక్రవారం ఉదయం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అందులో తన స్నేహితురాలు పవిత్రా లోకేశ్‌తో ఆయన ఏడడుగులు వేస్తూ కనిపించారు. ‘‘శాంతి, సంతోషాలతో కూడిన మా నూతన ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుతున్నాను. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు మూళ్లు.. ఏడడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్రా నరేశ్’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ఏదైనా సినిమా కోసం ఈ వీడియో షూట్ చేశారా? అనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఇది ఓ సన్నివేశమని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
‘సమ్మోహనం’ చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ (Naresh) - పవిత్ర (Pavitra) ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సందడి చేశారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియో ఆయా వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అందులో ఆయన పవిత్రను ముద్దాడుతూ కనిపించారు. అయితే.. ఈ వీడియో కూడా ఆ సినిమా ప్రచారంలో భాగమని తెలుస్తోంది. ఇక ఇప్పుడు షేర్ చేసిన తాజా వీడియోతో వీరి ‘పెళ్లి’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాగా.. రమ్య రఘుపతితో నరేశ్ విడాకుల వ్యవహారం కోర్టు విచారణలో ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
Ap-top-news News
CM Jagan: సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ఇప్పుడు చిక్కులు..