Niharika: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌

విడాకుల అనంతరం నిహారిక (Niharika Konidela) తొలిపోస్ట్‌ చేశారు. తనను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated : 05 Jul 2023 17:12 IST

హైదరాబాద్‌: నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela).. చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)తో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ విడుదల చేశారు.

‘‘నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నా వెన్నంటే ఉండి.. నాకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చిన నా కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల అనంతరం మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లేందుకు మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. చైతన్య సైతం ఇన్‌స్టా వేదికగా విడాకుల గురించి అధికారికంగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయంలో దయచేసి కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరారు.

2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తాజాగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. నటనకు కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన నిహారిక తాజాగా డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని