Nithiin: దొంగ పాత్రలో నితిన్‌

‘దేశం అంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులుపెడితే ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్‌ అవ్వలేదు...’ అంటున్నాడు నితిన్‌. ఆ కథేమిటో తెలియాలంటే ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్‌’ చూడాల్సిందే.

Updated : 27 Jan 2024 11:19 IST

‘దేశం అంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులుపెడితే ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్‌ అవ్వలేదు...’ అంటున్నాడు నితిన్‌. ఆ కథేమిటో తెలియాలంటే ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్‌’ చూడాల్సిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. నితిన్‌ - వెంకీ కుడుముల కలయికలో రూపొందుతున్న రెండో చిత్రమిది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేరుతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్‌ ఏం చేస్తావ్‌ అని అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటది. అన్నట్టే చేసింది...’ అంటూ మొదలయ్యే ఈ ప్రచార చిత్రం ఆసక్తికరంగా సాగింది. స్టైలిష్‌గా కనిపించిన నితిన్‌ ఇందులో ఓ దొంగగా కనిపిస్తారని ప్రచార చిత్రాన్నిబట్టి స్పష్టమవుతోంది. ‘‘నితిన్‌ని సరికొత్త పాత్రలో ఆవిష్కరించనున్న చిత్రమిది.  తన మొదటి రెండు  చిత్రాల్లో రెండు విభిన్నమైన కథాంశాల్ని స్పృశించిన వెంకీ కుడుముల మరో ఆసక్తికరమైన కథతో, తన మార్క్‌ వినోదంతో తెరకెక్కిస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కళ: రామ్‌ కుమార్‌, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని