Kamal Haasan: ప్రభాస్‌ కూడా ఆ విషయాన్ని నమ్మలేదు: కమల్‌హాసన్‌

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఈవెంట్‌ కోసం అమెరికా వెళ్లిన కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తాజాగా ఓ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో తాను నటించడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 24 Jul 2023 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో తాను నటించడంపై నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) స్పందించారు. ఈ సినిమాలో తాను భాగమయ్యానంటే ప్రభాస్‌ కూడా నమ్మలేదని ఆయన అన్నారు. ఈ సినిమా టైటిల్‌, గ్లింప్స్‌ రిలీజ్‌లో భాగంగా అమెరికాకు వెళ్లిన ఆయన ఓ హాలీవుడ్‌ పత్రికతో ముచ్చటించారు. ఈ సినిమా ఓకే చేయడానికి గల కారణాన్ని చెప్పారు.

‘ఆ సీన్‌ తొలగించకపోతే ఊరుకోం’.. హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌పై భారతీయులు ఫైర్‌

‘‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానంటే ఎవరూ నమ్మలేదు. నిజం చెప్పాలంటే.. శాన్‌ డియాగో కామికాన్‌ ఈవెంట్‌ కోసం నేను ఇక్కడికి వచ్చిన సమయంలో ప్రభాస్‌ నా చేయి పట్టుకుని.. ‘థ్యాంక్యూ సార్‌. మీరు మా సినిమాలో నటిస్తున్నారంటే ఈరోజు వరకూ నేనూ నమ్మలేదు. వాళ్లు (టీమ్‌) మిమ్మల్ని ఎలా ఒప్పించారనేది నాకింకా ఆశ్చర్యంగానే ఉంది’ అని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే నాగ్‌ అశ్విన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. నేనూ ఇందులో సంతోషంగా భాగమయ్యా. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్‌ కూడా అంతే అవసరం. అందుకే, ప్రతి నాయకుడిగా కనిపించడానికి ఓకే చేశా’’ అని కమల్‌ తెలిపారు.

నాగ్‌అశ్విన్ - ప్రభాస్‌ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు