Ott Movies: ఈ వారం ఓటీటీలో సందడి.. 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

Ott movies: ఒకవైపు వరుస సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తున్నాయి. మరోవైపు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. అలా ఈ ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కాబోయే సినిమాలేంటో చూసేయండి.

Updated : 22 Jun 2023 16:59 IST

టీకూ, షేరుల కథేంటి?

స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘టీకూ వెడ్స్‌ షేరు’ (Tiku Weds Sheru). నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి కబీర్‌ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలవుతుండటం గమనార్హం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూన్‌ 23వ తేదీ నుంచి ‘టీకూ వెడ్స్‌ షేరు’ స్ట్రీమింగ్‌ కానుంది.


లాడ్జ్‌లో హత్య.. ఒకే ఒక క్లూ.. ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’

లాల్‌, అజు వర్గీస్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌ మలయాళంలో నిర్మిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇది. లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి రంగంలోకి దిగిన ఆరుగురు పోలీస్‌ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్‌ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.


ఓటీటీలో ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రచారంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లోనూ సందడి చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూన్‌ 23న ‘మళ్ళీ పెళ్లి’(Malli pelli ott release date) స్ట్రీమింగ్‌ కానుంది.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • టేక్‌ కేర్‌ ఆఫ్‌ మాయా (హాలీవుడ్) జూన్‌ 19
  • గ్లామరస్‌ (ఒరిజినల్‌ సిరీస్‌) జూన్‌ 21
  • స్లీపింగ్‌ డాగ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 22
  • సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్‌) జూన్‌ 22
  • ఐ నంబర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

జీ5

  • కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌ (హిందీ) జూన్‌ 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • క్లాస్‌ ఆఫ్‌ 09 (వెబ్‌సిరీస్‌) జూన్‌ 19
  • సీక్రెట్‌ ఇన్వేషన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 21
  • ది కేరళ స్టోరీ (హిందీ) జూన్‌ 23
  • వరల్డ్స్‌ బెస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

సోనీలివ్‌

  • ఏజెంట్‌ (తెలుగు) జూన్‌23
  • అమెరికన్‌ అండర్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌) జూన్‌25

లయన్స్‌ గేట్‌ ప్లే

  • జాన్‌ విక్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23
  • స్లంబర్‌ (హాలీవుడ్‌) జూన్‌23
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని