Rajamouli: తారక్‌లా మరెవ్వరూ చేయలేరు.. రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలై సంచనాల్ని సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని వారాల్లోనే భారీ వసూళ్లతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

Published : 13 Apr 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సంచనాల్ని సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని వారాల్లోనే భారీ వసూళ్లతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. కొవిడ్‌ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.. లేదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ఇందులో నటించిన రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లపై ఈ సినిమా దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘వారిద్దరి మధ్య మంచి స్నేహభావం ఉంది. ఇద్దరిలో ఎవరు బాగా చేశారన్నది చెప్పడం కష్టం. అందరి సమష్టి కృషి ఈ సినిమా. చరణ్‌ క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించాడు. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడ’ని చెప్పారు. ఇక తారక్‌ గురించి చెబుతూ ‘ఈ సినిమాలో భీమ్‌ పాత్ర ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అలా నటించడం తారక్‌కు మాత్రమే సాధ్యం. ప్రేమ, బాధ... ఇలా అన్ని భావాలను చక్కగా పలికించాడు’ అని కొనియాడారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటించిన సంగతి తెలిసిందే. అలియాభట్‌, ఒలివియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని