Rakul Preet Singh: ప్రేమలో చీకటి కోణాలు
రకుల్‌ప్రీత్ సింగ్, పవేల్ గులాటీ జంటగా నిఖిల్ మహాజన్ తెరకెక్కిస్తున సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐ లవ్యూ’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు.
రకుల్‌ప్రీత్ సింగ్, పవేల్ గులాటీ జంటగా నిఖిల్ మహాజన్ తెరకెక్కిస్తున సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐ లవ్యూ’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు. అందులో నాయికానాయకుల లుక్‌ని ఆవిష్కరించారు. ప్రేమలో పడ్డ ఓ అమ్మాయి ఆ ప్రేమలో ఎదుర్కొన్న చీకటి కోణాల్ని ఇందులో ఆవిష్కరించడమే కథాంశంగా రూపొందించారు. జ్యోతి దేశ్‌పాండే, సునీర్ ఖేత్రపాల్, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తోటి కథానాయికలతో ఎలాంటి పోటీ ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇతరులతో కాదు.. నీకు నువ్వే నిత్యం పోటీ పడాలని స్కూళ్లో చదువుకున్నప్పుడే నేర్చుకున్నాను. నా ఉద్దేశంలో ఎవరికి వారే పోటీదారు. ఒక చిత్రం పూర్తి చేసి మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు నేనేం నేర్చుకున్నా అన్నదే నా ఎదుగుదల. తొమ్మిదేళ్లుగా పరిశ్రమలో ఉంటూ సొంతంగా ఎన్నో విషయాలు గమనించా’ అని చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా నిమజ్జనోత్సవం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు