Rashmika: నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది.. కెరీర్‌పై రష్మిక పోస్ట్‌

రష్మిక (Rashmika) తొలి సినిమా విడుదలై నేటికి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్‌ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ప్రత్యేక పోస్ట్‌ చేశారు.

Updated : 30 Dec 2023 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కిరాక్‌ పార్టీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక వరుస అవకాశాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో అగ్ర కథానాయకుల సినిమాల్లో నటిస్తున్నారు. తన తొలి సినిమా విడుదలై నేటికి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపిన రష్మిక ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు.

‘కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎలా జరిగిందనిపిస్తుంది. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఏమి తెలియకుండానే పరుగులు తీశాను. కానీ, సరైన వ్యక్తులతో ఉండడం వల్ల ఆలోచించి అడుగులు వేయగలిగాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. గంటల వ్యవధిలోనే 16 లక్షల మంది దీన్ని లైక్ చేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులందరికీ ఆమె రిప్లై ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. తాజాగా ‘యానిమల్‌’తో రష్మిక సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడిగా శ్రీవల్లిగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. అలాగే, ‘రెయిన్‌ బో’ని చిత్రాన్ని పూర్తి చేశారు. దీంతోపాటు మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు