Rashmika: అంతా ప్రేమమయం!

సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది రష్మిక. ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ చిత్రంతో సినీ ప్రియుల్నీ మెప్పించింది. దీని తర్వాత కథానాయకుడు విక్కీ కౌశల్‌తో ‘ఛావా’లో తెరపై కనిపించనుంది.

Updated : 29 Jan 2024 11:26 IST

సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది రష్మిక. ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ చిత్రంతో సినీ ప్రియుల్నీ మెప్పించింది. దీని తర్వాత కథానాయకుడు విక్కీ కౌశల్‌తో ‘ఛావా’లో తెరపై కనిపించనుంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది రష్మిక. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టిందామె. ‘చిత్రీకరణ విజయవంతంగా పూర్తైంది. దీన్ని అంగీకరించడానికి నా మనసుకి రెండ్రోజుల సమయం పడుతుందేమో! ఈ సినిమా మొత్తం ప్రేమమయమే. కథ, సంభాషణలే కాదు.. ఇందులో నటించిన వారంతా ప్రేమను పంచినవారే’ అంటూ రాసుకొచ్చింది. విక్కీ కౌశల్‌తో కలిసి పనిచేయడాన్ని గొప్ప అనుభవంగా చెబుతూ, ఆయనకెప్పుడూ మంచే జరగాలని కోరుకుంది. దీనిపై విక్కీ స్పందిస్తూ.. ‘షూటింగ్‌లో మీ ఎనర్జీ అద్భుతం. సెట్‌లో మేమందరం ఆ ఎనర్జీని మిస్‌ అవుతున్నాం. మా చిత్రంలో ఏసుబాయిగా నటించినందుకు ధన్యవాదాలు’ అన్నారు. డిసెంబరులో విడుదల కానుందీ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు