Salaar: ఇద్దరూ కలిసి కదిలితే కదనమే

‘సూరీడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి.. చిమ్మచీకటి నీడలా ఉండెటోడు’ అంటూ ‘సలార్‌’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు.

Updated : 14 Dec 2023 09:27 IST

‘సూరీడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి.. చిమ్మచీకటి నీడలా ఉండెటోడు’ అంటూ ‘సలార్‌’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలోని ‘సూరీడే..’ అంటూ సాగే మొదటి పాటను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. ‘సెగ ఒకడు.. సైన్యమొకడు.. కలిసి కదిలితే కదనమే. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదేలే.. నూరేళ్లు నిలవాలే’ అంటూ స్నేహ బంధాన్ని తెలిపేలా సాగుతున్న ఈ పాట హృదయాల్ని హత్తుకుంటోంది. రవిబస్రూర్‌ సంగీతమందించారు. కృష్ణకాంత్‌ సాహిత్యమందించిన ఈ గీతాన్ని హరిణి ఆలపించారు. హోంబలే ఫిలింస్‌ నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని