Bigg Boss Telugu7: బిగ్‌బాస్‌ నుంచి సందీప్ ఎలిమినేట్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఎనిమిదో వారం హౌస్‌ నుంచి సందీప్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

Updated : 30 Oct 2023 09:13 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu7) నుంచి సందీప్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్‌లో శోభాశెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌ ఉండగా, వీరిలో చివరకు సందీప్‌, శోభాశెట్టి మిగిలారు. వీరిద్దరిని ఒక గదిలో కూర్చొబెట్టి వాళ్ల చేతులకు ప్యాచ్‌ను అతికించుకోమన్నారు హోస్ట్‌ నాగార్జున. కౌంట్‌డౌన్‌ మొదలయ్యాక ఇద్దరీ హార్ట్‌ బీట్‌ ప్లాస్మా టీవీపై కనిపిస్తుందని.. ఎవరీ హార్ట్‌ బీట్‌ అయితే కంటిన్యూ అవుతుందో వాళ్లు సేఫ్‌, హార్ట్‌ బీట్‌ ఆగిన పోయిన వారు ఎలిమినేట్‌ అవుతారన్నారు. సందీప్‌ హార్ట్‌ బీట్‌ ఆగిపోయినట్లు చూపించడంతో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. సందీప్‌ ఎలిమినేషన్‌తో తేజ, శోభ, ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు. 

అంతకుముందు బిగ్‌బాస్‌ హౌస్‌లో స్పాన్సర్‌ షిప్‌ టాస్క్‌ నిర్వహించారు. సందీప్‌, భోలే షావలి కెప్టెన్లుగా వ్యవహరించారు. టీం భోలే విజేతగా నిలిచింది. అనంతరం బోటు గేమ్‌, ‘డైలాగ్‌ కొట్టు గురూ’ అనే ఫన్నీ గేమ్స్‌ ఆడించారు. ‘రతికా.. యావర్‌ ఓకే కదా మీరేమీ గొడవపడలేదు కదా!’ అని నాగార్జున ప్రశ్నించారు. దీనికి రతిక సమాధానమిస్తూ ‘పడ్డాం సర్‌.. కొద్దిగా పడ్డాం. బ్యాలెన్స్‌ తప్పకుండా బ్యాలెన్స్‌గా ఎలా వెళ్లాలి అనేది నేర్చుకోవాలి’ అన్నారు. ‘రతిక నీలో ఉన్న గొప్పదనం ఎంటో తెలుసా.. నీ మూలానా అవతల వాళ్లు బ్యాలెన్స్‌ తప్పుతారు కానీ, నువ్వు తప్పవు’ అని నాగార్జున అనగానే హౌస్‌మేట్స్‌ బిగ్గరగా నవ్వారు.

సందీప్‌ నువ్వు వెళ్లే ముందు ఇంటిలోని ప్రతి ఒక్కరి గురించి నీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌, లాస్ట్‌ ఇంప్రెషన్‌ చెప్పమని నాగార్జున కోరారు. 

  • శోభాశెట్టి: చాలా సాఫ్ట్‌, చాలా స్ట్రాంగ్‌ ప్లేయర్‌. ఒక్కొసారి చిన్న పిల్లలా అనిపిస్తుంది
  • అర్జున్‌: డార్లింగ్‌. కొంచె బ్యాలెన్స్‌గా ఉన్నాడు. 
  • అమర్‌దీప్‌: బెస్ట్‌ పర్సన్‌. మై బెస్ట్‌ ఫ్రెండ్‌
  • యావర్‌: చాలా సెన్సిటివ్‌. లవ్లీ బ్రదర్‌. చాలా స్ట్రాంగ్‌ ప్లేయర్‌
  • శివాజీ: అన్న బంగారం. హార్ట్‌ఫుల్‌ పర్సన్‌
  • ప్రియాంక: ఆల్‌టైమ్‌ ఫెవరెట్‌
  • రతిక: చాలా షార్ప్‌ అనుకున్నా.. కొంచెం అమాయకురాలు
  • గౌతమ్‌: ఇంటలెక్చువల్‌ 
  • అశ్విని: ఈ అమ్మాయి అసలు ఆడుతుంది అనుకోలేదు. గత రెండు వారాల ఆట చూసి నేను షాక్‌ 
  • భోలే షావలి: చాలా బాగా మాట్లాడతారు. నేను మీలాగా ఎవ్వరినీ చూడలేదు
  • ప్రశాంత్‌: చాలా చాలా షార్ప్‌
  • తేజ: హౌస్‌లో అందరికన్నా తెలివైనవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని