Shakeela interview: హౌస్‌లో ఆమె అందమైన పాము.. తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు!

Bigg Boss Telugu 7: హౌస్‌లో ఇప్పటికీ చాలా మంది మాస్క్‌ వేసుకుని నటిస్తున్నారని, వాళ్లలా తాను ఉండలేనని సినీ నటి షకీలా అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 18 Sep 2023 15:47 IST

బిగ్‌బాస్‌కు తాను ఏదో ఒక గోల్‌ పెట్టుకుని రాలేదని,  నిర్వాహకులు పిలిస్తేనే వచ్చానని నటి షకీలా (shakeela) అన్నారు. నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో  బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7).  రెండో వారం సినీ నటి షకీలా ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెండు వారాల తన జర్నీతో పాటు, హౌస్‌మేట్స్‌ ఎవరు ఎలాంటి వారో చెప్పారు. ఈ సంద్భరంగా పలు విషయాలను పంచుకున్నారు.

నేను ఎలిమినేట్‌ కావడానికి యావర్‌ కారణం!

‘‘అనవసరంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. శివాజీ అన్న తప్ప అందరూ కొత్తవాళ్లు. మొదటిరోజే నామినేషన్స్‌ మొదలయ్యాయి. అక్కడే సమస్య కూడా మొదలైంది. మిగిలిన హౌస్‌మేట్స్‌తో కలవడానికి నాకు సమయం దొరకలేదు. నా వరకూ నేను 100శాతం నా ప్రదర్శన ఇచ్చా. బహుశా బాత్రూమ్‌ క్లీన్‌ చేయలేదేమో. నేను బయటకు రావడానికి ప్రిన్స్‌ యావర్‌ కారణం. అతను చెప్పిన సిల్లీ రీజన్‌ నేనెప్పుడూ వినలేదు. కేవలం ఉక్రోషంతోనే నన్ను నామినేట్‌ చేశాడు. ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్లకు సౌకర్యంగా ఉండాలి. ఆ విషయం చెప్పడం తప్పయింది. ఎవరైనా తనకు ఒంట్లో బాగాలేదంటే, ఇతరులు అర్థం చేసుకోవాలి ’’

ఆమె అలా పిలవడం నాకు నచ్చలేదు!

‘‘హౌస్‌లో ఫేక్‌గా ఉండటం నాకు ఇష్టం లేదు. కొందరు మాస్క్‌ వేసుకుని నటిస్తున్నారు. అన్ని పనులు నేను చేశానని చెప్పను. హౌస్‌మేట్స్‌ నాకు పనిచేసే అవకాశం ఇవ్వలేదు. ఎలిమినేట్‌ అయినందుకు నేనేమీ బాధపడటం లేదు. అయితే, ఇప్పుడిప్పుడే ఎవరు ఎలాంటి వారో అర్థమైంది. ఈ వారం ఎవరిని నామినేట్‌ చేయాలో కూడా పేర్లు అనుకున్నా. అంతలోపే నేను బయటకు వచ్చేశా. నాకు అవకాశం వస్తే, మళ్లీ హౌస్‌లోకి (Bigg Boss Telugu 7) వెళ్తా. అందరితోనూ ‘అమ్మ’ అని పిలిపించుకోవడం నాకు నచ్చింది. రతికా రోజ్‌ నన్ను ‘షకీలా.. షకీలా’  అని పిలవడం వల్ల కాస్త హర్ట్‌ అయ్యాను’’

  • హౌస్‌మేట్స్‌ గురించి షకీలా అభిప్రాయమిదే!
  • శోభాశెట్టి: బాధ్యతలేని వ్యక్తి. మొన్నటి వరకూ ఒక మాస్క్‌తో ఉంది. తనకు తెలియకుండానే ప్రభావితమై, ఆ మాస్క్‌ను తొలగించుకుంటోంది. రతికా ఆమెను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తోంది.
  • అమర్‌దీప్‌: చాలా సున్నితమైన మనస్తత్వం. అందరి ప్రేమను కోరుకుంటాడు. చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. అయితే, ఏదైనా అంటే తట్టుకోలేడు.
  • ప్రిన్స్‌ యావర్‌: స్టుపిడ్‌. కేవలం బాడీ బిల్డింగ్‌ను పెట్టుకుని ఎత్తుకు ఎదుగుతానంటే కుదరదు. ఓవర్‌ కాన్ఫిడెంట్‌ ఉండకూడదు.
  • గౌతమ్‌కృష్ణ:  మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఇలాంటి కొడుకును కన్నందుకు అతని తల్లిదండ్రులు అదృష్టవంతులు.
  • దామిని: ఏంజిల్‌. హౌస్‌లో ఉన్న బెస్ట్‌ గర్ల్‌. ఓపెన్‌ మైండ్‌, భయంలేని వ్యక్తి.
  • పల్లవి ప్రశాంత్‌: బ్లడీ రాంగ్‌ యాటిట్యూడ్‌. వచ్చిన రోజు చెప్పులు తీసి ఇంట్లోకి వచ్చావు. రెండో రోజు చెప్పులు వేసుకుని, ఇంట్లో కూర్చొన్నావు. మూడో రోజు కాలు మీద కాలువేసుకున్నావు. నాలుగోరోజు ఎదుట వ్యక్తి ముందు కాలుమీద కాలువేసుకుని ఆడిస్తున్నాడు. నీ కాలు నువ్వు ఆడించుకో. రైతుబిడ్డ అనే ఇమేజ్‌తో అతన్ని తీసుకొస్తే, దాన్ని మర్చిపోయాడు. పాపులారిటీ అనే డ్రగ్‌ తలకెక్కింది.  తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.
  • టేస్టీ తేజ: మంచి ఎంటర్‌టైనర్‌. పని మాత్రం చేయడు.
  • ప్రియాంక జైన్‌: మంచి అమ్మాయి.
  • సందీప్‌: చాలా బలమైన కంటెస్టెంట్‌. కష్టపడి పనిచేస్తాడు. నిజాయతీగా ఉంటాడు. హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి.
  • శుభశ్రీ: ఆమెను జడ్జ్‌ చేయలేం.
  • శివాజీ: ఈ హౌస్‌కు వెన్నెముక. నిజమైన బ్రదర్‌. వచ్చే జన్మఉంటే ఈ అన్నకే చెల్లెలిగా పుట్టాలి.
  • రతికా రోజ్‌: హౌస్‌లో ఉన్న అందమైన పాము. ఎవరితోనూ ఐ-కాంటాక్ట్‌ పెట్టుకోదు. చాలా మందిని ప్రభావితం చేస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని