రామ్‌ కొత్తసాంగ్‌ విన్నారా

తనదైన శైలిలో జానపద గీతాల్ని ఆలపించి ఎంతోమంది సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు రామ్‌ మిరియాల. ‘జాతిరత్నాలు’ కోసం ఇటీవల ఆయన పాడిన ‘చిట్టి నీ నవ్వంటే’ పాట మంచి హిట్‌...

Published : 15 Mar 2021 15:35 IST

హైదరాబాద్‌: తనదైన శైలిలో జానపద గీతాల్ని ఆలపించి ఎంతోమంది సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు రామ్‌ మిరియాల. ‘జాతిరత్నాలు’ కోసం ఇటీవల ఆయన పాడిన ‘చిట్టి నీ నవ్వంటే’ పాట మంచి హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్‌ నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్పక విమానం’ కోసం రామ్‌ ‘సిలకా ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి యెనకా’ అనే పాట పాడారు. తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. గ్రామీణ యాసలో సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. గీత్‌ షైనీ, శాన్వీ మేఘన కథానాయికలు. దామోదర దర్శకుడు. ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆనంద్‌ విభిన్నమైన లుక్‌లో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది. ఈ చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని