మోస్ట్‌ వెయిటెడ్‌ వీడియో ఆగయా!

సినీ ప్రియులందరికీ ‘ఉప్పెన’ టీమ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జలజల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌ని తాజాగా విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన....

Updated : 19 Mar 2021 10:16 IST

ఫిదా అవుతోన్న నెటిజన్లు

హైదరాబాద్‌: సినీ ప్రియులందరికీ ‘ఉప్పెన’ టీమ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జలజల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌ని తాజాగా విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్ జాజ్ గాత్రం తోడవడంతో సినిమా విడుదలకు ముందే ఈ పాటకు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మెలోడికి సంబంధించిన పూర్తి‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిల హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ పాటను విడుదల చేసిన కొద్దిసేపటికే 32 లక్షల మంది వీక్షించారు. అలాగే 1.55 లక్షల మంది లైక్‌ చేశారు.

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని