SS Rajamouli: రాజమౌళి సమర్పించు.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’

దర్శకుడు రాజమౌళి కొత్త కబురు వినిపించారు. ఆయన సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే బహు భాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 20 Sep 2023 13:55 IST

దర్శకుడు రాజమౌళి కొత్త కబురు వినిపించారు. ఆయన సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే బహు భాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి రాజమౌళి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ కథ విన్న వెంటనే నేను తీవ్ర భావోద్వేగానికి గురయ్యా. బయోపిక్‌లను రూపొందించడం కష్టం. అలాంటిది భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంతో గర్వంతో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నా’’ అని పేర్కొన్నారు. రాజమౌళి ట్వీట్‌ సారాంశాన్ని బట్టి.. భారతీయ సినిమా చరిత్ర ఏంటి? దీనికి పునాది ఎక్కడ పడింది? ఏ విధంగా ఎదిగింది? అన్న విషయాల్ని దీంట్లో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా పితామహుడైన దాదా సాహెబ్‌ ఫాల్కేతో పాటు ఈ ప్రయాణంలో కీలకంగా నిలిచిన ఎంతో మంది చిత్ర ప్రముఖుల గురించి ఇందులో చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఒకరకంగా ఇది భారతీయ సినిమా బయోపిక్‌ అని చెప్పొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని