Miss Universe: అందానికి పట్టాభిషేకం జరిగి 29 ఏళ్లు.. నాటి ఫొటో షేర్ చేసిన నటి
ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ (Sushmita Sen) ఓ ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి సుస్మితా సేన్ (Sushmita Sen) తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. భారత్‌కు మొదటిసారి విశ్వసుందరి (Miss Universe) కిరీటం వచ్చి 29 ఏళ్లు అయిందని ఆనాటి ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది.
29 ఏళ్ల క్రితం ఫొటో షేర్ చేసిన సుస్మిత సేన్.. ‘‘ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18 ఏళ్లు. నన్ను ఆ ఫొటో గ్రాఫర్ మరింత అందంగా తన కెమెరాలో బంధించాడు. ‘నేను తీస్తున్న మొదటి విశ్వసుందరి ఫొటో నీదే’ అంటూ అతను చిరునవ్వులు చిందిస్తూ నాతో చెప్పాడు. భారత్ నుంచి పోటీ చేసి ఆ కిరీటాన్ని గెలుచుకున్న క్షణాలు నా కళ్ల ముందు ఇంకా మెదిలాడుతున్నాయి. నా మాతృభూమి తరపున పోటీలో పాల్గొనడం.. గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. 29 ఏళ్ల తర్వాత కూడా ఆరోజును తలచుకుంటే నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగడంలేదు. 21 మే 1994 చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్ చేసుకుంటాను. ఈ సందర్భంగా నాకు మెసేజ్‌లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అని రాశారు.
ఇక పోస్ట్ చూసిన అభిమానులు, సినీప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ విశ్వసుందరే’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మీరు ఎంతోమందికి ఆదర్శమని’ మరొక యూజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుస్మిత షేర్ చేసిన ఫొటో మాత్రం ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naresh: ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్.. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో’ అని ఆయన చివరిగా చెప్పారు: నరేశ్
-
Crime News
Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: సికింద్రాబాద్లో సినీ ఫక్కీలో దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనా?
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’