Samantha: 2021.. ఇది నాకో క్లిష్టమైన సంవత్సరం: సమంత

ఈ ఏడాది తన జీవితంలో ఎంతో కష్టంగా సాగిందని అగ్రకథానాయిక సమంత అన్నారు. బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానెల్‌ వారు స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు....

Published : 26 Nov 2021 17:20 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది తన జీవితంలో ఎంతో కష్టంగా సాగిందని అగ్రకథానాయిక సమంత అన్నారు. బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్రతోపాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. డిసెంబర్‌ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఓ స్పెషల్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. అందరూ భిన్నమైన అభిప్రాయాలు పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. ‘‘తన జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’’ అని తెలిపారు. ఈ వీడియో చూసిన సామ్‌ అభిమానులు.. ‘‘బీ స్ట్రాంగ్‌’’ అని కామెంట్లు చేస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలో ఈ ఏడాది సమంత ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్యతో వైవాహిక బంధానికి ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట అక్టోబర్‌ 2న ప్రకటించింది. దీంతో మానసికంగా కుంగుబాటుకు లోనైన సామ్‌.. ఆ బాధ నుంచి బయటకువచ్చేందుకు కెరీర్‌పై దృష్టి సారించారు. వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆమె తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ సామ్‌ కీ రోల్‌ పోషిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’, ‘కాతువక్కుల రెందు కాదల్‌’ చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’తో ఈ ఏడాది ఆరంభంలోనే ఆమె నటిగా మంచి సక్సెస్‌ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని