Anand Devarakonda: ‘హైవే’.. ప్రయాణం సంపూర్ణం

ఆనంద్‌ దేవరకొండ హీరోగా కేవీ గుహన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్‌ తలారి నిర్మాత. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందిస్తున్నారు. విభిన్నమైన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా

Updated : 10 Oct 2021 09:28 IST

ఆనంద్‌ దేవరకొండ హీరోగా కేవీ గుహన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్‌ తలారి నిర్మాత. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందిస్తున్నారు. విభిన్నమైన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి క్షణం ఆసక్తికర ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగే చిత్రమిది. టెక్నికల్‌గా ఉన్నతంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకొస్తాం’’ అన్నారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో చిత్రీకరణ జరిపాం. దీంట్లో కొందరు ప్రముఖ నటీనటులు పని చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు చిత్ర నిర్మాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని