Rashmi Gautham: ఒక్క రూపాయి అయినా దానం చేయండి.. రష్మి అభ్యర్థన

మూగ జీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే నటి, బుల్లితెర వ్యాఖ్యాత రష్మి చలించిపోతుంది. ఎక్కడ ఏ జంతువుకి హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. ఇటీవల ఇషాన్‌ అనే కుక్క గాయపడగా దాన్ని చూసి కలత చెందింది. చికిత్స కోసం దానం చేయండంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానుల్ని అభ్యర్థించింది.

Published : 18 Aug 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూగజీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే నటి, బుల్లితెర వ్యాఖ్యాత రష్మి చలించిపోతుంది. ఎక్కడ.. ఏ జంతువుకి హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. ఇటీవల ఇషాన్‌ అనే కుక్క గాయపడగా దాన్ని చూసి కలత చెందిన ఆమె, చికిత్స కోసం దానం చేయండంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానుల్ని అభ్యర్థించింది. ‘ నెల క్రితం ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఇషాన్‌ అనే కుక్క ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి దాని చికిత్సకు రోజుకి రూ.300-400 ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. నా వంతు సాయం నేను చేస్తున్నా. మీరూ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్‌ మీకు తోచినంత సాయం చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అనుసరిస్తున్న వారు 3.7 (37,7800) మిలియన్‌కి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అందరం కలిసి సాయం చేద్దాం’ అని కోరింది. డొనేట్‌ చేసే లింక్‌ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. చికిత్స పూర్తయిన తర్వాత ఇషాన్‌ని అలా వదిలేయకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి, వాటిని అలాగే వదిలేస్తున్నారని, దీనికి పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ని ఇటీవల ట్విటర్‌ వేదికగా కోరిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని