Tollywood: తొలి టాకీ చిత్రానికి 90 ఏళ్లు

 తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగు సినిమా ఎప్పుడో పుట్టినా కొంతకాలం మూకీ (మాటలు లేకుండా అభినయించడం)కే పరితమైంది.

Published : 31 Oct 2021 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సుమారు 100 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. తెలుగు సినిమా ఎప్పుడో పుట్టినా కొంతకాలం మూకీ (మాటలు లేకుండా అభినయించడం)కే పరితమైంది. 1931లో తొలిసారి మాటల్ని వినిపించింది. ప్రేక్షకుల్ని అమితాశ్చర్యానికి గురిచేసింది. అలా ప్రేక్షకులు అద్భుతమని భావించిన మాటల చిత్రమే ‘కాళిదాస్‌’. తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన తొలి టాకీ సినిమా ఇది. 1931 అక్టోబరు 31న విడుదలైంది. మహాకవి కాళిదాసు జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారతీయ తొలి టాకీ చిత్రం ‘ఆలం అరా’ ముంబయిలో ఎక్కడైతే చిత్రీకరణ జరిగిందో అదే సెట్స్‌లో ‘కాళిదాస్‌’ షూటింగ్‌ జరుపుకొంది. పి.జి. వెంకటేశన్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. టి.జి. రాజలక్ష్మి నాయికగా కనిపించారు. ఎల్వీ ప్రసాద్‌, టి.సుశీలా దేవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హెచ్‌.ఎం.రెడ్డి  దర్శకత్వం వహించారు.

మరో రోజు ప్రకటిస్తా: మంచు విష్ణు

‘కాళిదాస్‌’ చిత్రం 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఓ విషయాన్ని నటుడు, ‘మా’ అధ్యక్షుడు చెప్పాలనుకున్నారు. కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణంతో అందరి హృదయాలు బాధతో నిండిపోయాయని, అందుకే మరో రోజు ఆ వివరాల్ని ప్రకటిస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని