Kaikala Satyanarayana:తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: కైకాల కుమార్తె

ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స కొనసాగుతోంది.

Updated : 23 Nov 2021 15:45 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.  ప్రస్తుతం కైకాల ఆరోగ్యం  మెరుగుపడుతోందని ఆయన కుమార్తె రమాదేవి తెలిపారు.  కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. ‘‘నాన్నగారు క్రమంగా కోలుకుంటున్నారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  కైకాల ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’’ అని రమాదేవి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని