Bigg boss Telugu 5: బిగ్‌బాస్‌లో అంకుల్స్‌ వెళ్లిపోవాలి.. గేమ్‌ ఈ రోజుతో అయిపోయేది కాదు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఈ వారం ఇంటి సభ్యులకు ‘అభయహస్తం’ టాస్క్‌ ఇస్తున్నట్లు....

Updated : 26 Oct 2021 18:16 IST

హైదరాబాద్‌: ఈరోజు హౌస్‌మేట్స్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘నేనూ మానస్‌ టాప్‌-5 దాకా ఉంటాం’ అని పింకీ అంటే ‘మరి మేమేంటి అడుక్కు తినాలా’ అంటూ సిరి సమాధానం ఇచ్చింది. ఇక ‘అంకుల్స్‌ అందరూ వెళ్లిపోవాలి. కుర్రాళ్లు ఉండిపోవాలి’ అని మానస్ అంటే ‘ఆంటీలు వెళ్లిపోవాల్సి వస్తే ప్రియాంక కూడా వెళ్లిపోతుంది’ అంటూ సిరి ఆటపట్టించింది. ‘వేర్‌ ఈజ్‌ షన్ను అంటే, మోజ్‌ రూమ్‌ విత్‌ త్రీ, ఆన్‌ బెడ్‌ విత్‌ త్రీ ఇదే నాకు కనిపించింది’ అని షణ్ముఖ్‌కు రవి గీతోపదేశం చేశాడు. శ్రీరామ్‌ శకునిలా మాట్లాడుతూ.. రవిని ఉద్దేశించి ‘దుర్యోధన’ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇక హౌస్‌మేట్స్‌ను మానస్‌, సన్నీ, రవిలు అనుకరించిన విధానం కితకితలు పెడుతోంది.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఈ వారం ఇంటి సభ్యులకు ‘అభయహస్తం’ టాస్క్‌ ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ సూచించాడు. టాస్క్‌లో భాగంగా హౌస్‌ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. టాస్క్‌లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకు కెప్టెన్సీ పోటీలోకి ఎంట్రీతో పాటు ఇంటిలోపలికి వెళ్లే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు తెలిపాడు. దీంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అనంతరం ‘అభయహస్తం’ టాస్క్‌లో షణ్ముఖ్‌ - లోబో హోరాహోరీగా తలపడ్డారు. బురదతో నిండిన బాత్‌టబ్‌ నుంచి కాయిన్స్, బాల్స్‌ని సేకరించారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్‌ - విశ్వ, కాజల్‌ - లోబోల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ‘‘నా ఇష్టం నేను మాట్లాడతా. నీకు ఇబ్బంది ఉంటే చెవులు మూసుకో’’.. అంటూ లోబోపై కాజల్‌ ఫైర్‌ అయ్యారు. ‘అభయహస్తం’ టాస్క్‌లో బిగ్‌బాస్‌ పెట్టిన కండిషన్స్ ఏమిటి? కాజల్‌ - లోబోల మధ్య వాగ్వాదానికి కారణమేమిటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని