
jabardasth: అభి.. ఇక స్కిట్ చాలు వెళ్లు: రోజా
హైదరాబాద్: కమెడియన్ల వరుస పంచులు.. న్యాయనిర్ణేతల సెటైర్లతో ప్రతివారం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్’. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ వేడుకగా జరిగాయి. పండుగ కానుకగా టీమ్ లీడర్లు అందరూ అద్భుతమైన స్కిట్స్‌తో స్టేజ్‌పై పంచుల వర్షం కురిపించారు. ఆది, రాఘవ, అభి, తాగుబోతు రమేశ్‌లు వేసిన వరుస పంచులతో న్యాయనిర్ణేతలు రోజా, మనో నవ్వుకున్నారు. ఆది స్కిట్‌లోకి అనసూయ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘నీకు క్యాన్సర్ అని నాకు ఎందుకు చెప్పలేదు?’’ అని అనసూయ అడగ్గా.. ‘‘నీది స్కార్పియో అని నాకు ఎందుకు చెప్పలేదు?’’ అని ఆది ప్రశ్నించాడు. ‘‘అంటే నువ్వు రాశీగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?’’ అని అనూ అనగా.. ‘‘అది రాశీగారి ఫలాలు కాదమ్మా.. రాశీఫలాలు’’ అంటూ ఆది కామెంట్ చేయడంతో రోజా కడుపుబ్బా నవ్వుకున్నారు.
అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన అభి స్కిట్ ప్రారంభిస్తూ.. ‘‘సౌండ్ లేకుండా దీపావళి.. బయటకు వెళ్లకుండా వినాయకచవితి.. అమ్మాయి లేకుండా పెళ్లి.. ఈ అభి లేకుండా కామెడీ జరగవు’’ అని చెప్పగానే.. ‘‘వచ్చి రాగానే పంచులు బాగా వేశావు. ఇక చాలు స్కిట్.. పద పద’’ అంటూ రోజా కౌంటర్ వేయడంతో అభి ఒక్కసారిగా షాకయ్యారు. మరోవైపు స్కిట్‌లో భాగంగా లేడీ గెటప్ ధరించి గాలిపటాల సుధాకర్ చేసిన ఫీట్లు చూసి రోజా పడిపడి నవ్వుకున్నారు. ఈ నవ్వుల తారాజువ్వలను చూడాలంటే వచ్చే గురువారం వరకూ వేచి ఉండాల్సిందే.
ఇవీ చదవండి
Advertisement