Ishq: చీకటి చిరుజ్వాలై నిప్పులుకురిసిందే

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన నటుడు తేజ. ‘జాంబీరెడ్డి’తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘ఇష్క్‌’. ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన....

Published : 22 Jul 2021 11:35 IST

హైదరాబాద్‌: బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన నటుడు తేజ. ‘జాంబీరెడ్డి’తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘ఇష్క్‌’. ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘చీకటి చిరుజ్వాలై నిప్పులు కురిసిందే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, ఉమా నేహా ఆలపించారు. లవ్‌, సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికగా నటించారు. మెగా సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎన్‌.వి. ప్రసాద్‌, అంజన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నిరకాల పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని