Radhe Shyam: లవ్‌స్టోరీయే కాదు, అంతకు మించిన ట్విస్ట్‌లు ఉంటాయి: ప్రభాస్
అనేక పరిస్థితులను దాటుకుని, ఐదేళ్ల పాటు ఒక సినిమా కోసం పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమని, ఆ క్రెడిట్ అంతా దర్శకుడు
హైదరాబాద్: అనేక పరిస్థితులను దాటుకుని ఐదేళ్ల పాటు ఒక సినిమా కోసం పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమని, ఆ క్రెడిట్ అంతా దర్శకుడు రాధాకృష్ణకే దక్కుతుందని అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas) అన్నారు. పూజాహెగ్డే (Pooja Hegde)తో కలిసి ప్రభాస్ హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ (Radhe Shyam). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘గోపీకృష్ణ బ్యానర్‌పై మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చేశాం. ఇది లవ్‌స్టోరీయే కానీ, అంతకుమించి ఉంటుంది. కొవిడ్ సమయంలో చిత్ర బృందం చాలా కష్టపడింది. రెండేళ్లు జార్జియా, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిపారు. అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ చాలా అందంగా ‘రాధేశ్యామ్’ను తీర్చిదిద్దారు. దర్శకుడు రాధాకృష్ణ ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. నిజంగా ఆయన ఓపికను మెచ్చుకోవాలి. సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది. అభిమానుల వల్లే ఈ కార్యక్రమం ఇంతా బాగా జరిగింది’’ అని అన్నారు.
అంతకుముందు దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది. రాయడానికి 18 సంవత్సరాలు పట్టింది. మొదటిసారి ఈ పాయింట్ నా గురువు చంద్రశేఖర్ యేలేటిగారి దగ్గర విన్నాను. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రచయితలను అందరినీ రప్పించి కథపై చర్చించాం. కానీ, ఈ కథకు ఒక ముగింపు దొరకలేదు. ఆ సమయంలో యేలేటి గారు ఒకమాట అన్నారు. ‘ఈ కథ జాతకాల మీద చేస్తున్నావు. ఎవరికి రాసి పెట్టి ఉందో’ అన్నారు. ఇది ప్రభాస్ గారికి రాసిపెట్టి ఉంది. ఆయనతో ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు, ఈ పాయింట్ మా గురువు దగ్గర తీసుకుని ఒక ఫిలాసఫీని లవ్ స్టోరీగా చేసి, కథ రాసి ఆయనకు చెప్పాను. ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం ఉండవు. ఒక అమ్మాయికి అబ్బాయికీ మధ్య జరిగే యుద్ధాలే ఉంటాయి. అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు దాటుకుంటూ ఎలా వెళ్లాడన్నది కథ. మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత తప్పకుండా నచ్చుతుంది. మనోజ్ పరమహంస ప్రతి సన్నివేశాన్ని బృందావనంలా చూపించారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ లేకపోతే ఈ సినిమా లేదు. పూజా హెగ్డే.. ప్రేరణ పాత్ర కోసమే పుట్టిందేమో. ప్రభాస్ నా కోసం చాలా చేశారు. మీలాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరికీ ఉండాలి. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. జనవరి 14న అందరూ రండి.. ప్రేమించుకుందాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్‌పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్