Rajamouli: ఆరోజు అజిత్ చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోను: రాజమౌళి
కోలీవుడ్ స్టార్హీరో అజిత్ తనతో ప్రవర్తించిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ తమిళ ఛానెల్‌కు ఆయన, చరణ్, తారక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ....
హైదరాబాద్: కోలీవుడ్ స్టార్హీరో అజిత్ ఎంతో సాధారణంగా ఉంటారని.. ఆయన తనను పలకరించిన విధానాన్ని తాను ఎప్పుడూ మర్చిపోలేనని దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ తమిళ ఛానల్‌కు ఆయన, చరణ్, తారక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్హీరోలతో తమకున్న అనుబంధంపై స్పందించారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అజిత్ సాదాసీదాగా ఉంటాడని.. డౌన్ టు ఎర్త్ పర్సన్ అని రాజమౌళి ప్రశంసించారు. అనంతరం అజిత్‌ని కలిసిన ఓ రోజుని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘సితార హోటల్లో ఓసారి అజిత్‌ని చూశా. హోటల్లోని రెస్టారెంట్లో ఆయన భోజనం చేస్తూ కనిపించారు. ఆయన వద్దకు వెళ్లకుండా వేరే టేబుల్లో కూర్చొని నా సతీమణి రమా కోసం ఎదురుచూస్తున్నా. అదే సమయంలో నన్ను చూసిన అజిత్ నా వద్దకు వచ్చి.. ‘‘సర్. ఎలా ఉన్నారు?’’ అని పలకరించారు. నన్ను కూడా ఆయన టేబుల్ వద్దకు తీసుకువెళ్లారు. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో రమా రెస్టారెంట్లోకి వచ్చి నాకోసం చూస్తోంది. దాంతో నేను పిలుస్తుండగా.. అజిత్ ఆమె వద్దకు వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చారు. మాతో ఎంతో సరదాగా మాట్లాడారు. కోట్లాది మంది అభిమానులు కలిగిన ఆయన సాధారణ వ్యక్తిలా తనని తాను పరిచయం చేసుకుని మాతో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇటీవల కాలంలో తనని తలా అని పిలవొద్దు అని కేవలం ఏకే, లేదా అజిత్‌కుమార్ అని మాత్రమే పిలవమని చెప్పడం నాకెంతో నచ్చింది’’ అని రాజమౌళి తెలిపారు.
అనంతరం విజయ్ గురించి తారక్ స్పందించారు. విజయ్ తనకెంతో నచ్చిన వ్యక్తి అని తెలిపారు.‘‘విజయ్ సూపర్‌స్టార్. నాకొక గురువు, బ్రదర్, ఫ్రెండ్. అప్పుడప్పుడూ మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇటీవల ‘మాస్టర్’ విడుదలైనప్పుడు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను. స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆయనలో ఆ గర్వం కనిపించదు. సాధారణమైన వ్యక్తిలాగే ఉంటారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ అంటే నాకెంతో ఇష్టం’’ అని తారక్ చెప్పారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్‌పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్‌లోకి రాజమౌళి - మహేశ్‌ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్‌కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్‌పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్‌పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్‌కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్‌లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు