Sohel: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’గా రానున్న సోహెల్‌

‘కథవేరే ఉంటది.. నేను గిట్లనే ఉంట..‌’ అంటూ ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నారు నటుడు సోహెల్‌. సినిమాపై ఉన్న ఆసక్తితో...

Published : 05 Sep 2021 14:27 IST

హైదరాబాద్‌: ‘కథవేరే ఉంటది.. నేను గిట్లనే ఉంట..‌’ అంటూ ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నారు నటుడు సోహెల్‌. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ అని టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సినిమా టైటిల్‌, హీరో ఫస్ట్‌గ్లిమ్స్‌ని నేచురల్‌ స్టార్‌ నాని నెట్టింట్లో షేర్‌ చేశారు.  శ్రీనివాస్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని