Narappa: అభిమానులూ.. ఈసారి థియేటర్లలోనే సందడి!

‘నా కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు పోషించాను. కానీ ‘నారప్ప’కి కనెక్ట్‌ అయినంతా ఏ పాత్రకీ అవలేదు’ అని వెంకటేశ్‌ అన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌ నటించిన చిత్రం ‘నారప్ప’.

Published : 30 Jul 2021 20:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు పోషించాను. కానీ ‘నారప్ప’కి కనెక్ట్‌ అయినట్టు ఏ పాత్రకీ కాలేదు’ అని సినీనటుడు వెంకటేశ్‌ అన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌ నటించిన చిత్రం ‘నారప్ప’. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా కథానాయకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నారప్ప’ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు పోషించాను. ఎప్పుడూ ఏ పాత్రలో ఇంతగా లీనమవని నేను ‘నారప్ప’తో బాగా కనెక్ట్‌ అయ్యాను. మాతృక ‘అసురన్‌’ హక్కులు ఇచ్చినందుకు దర్శకుడు వెట్రిమారన్‌, నటుడు ధనుష్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నా. నా సహ నటులు, దర్శకుడు, సాంకేతిక బృందం ఎంతో కష్టపడ్డారు. నాకు ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచింది. థియేటర్లలో విడుదల చేయలేదనే బాధలో ఉన్నా అభిమానులు ఆదరించారు. ఈసారి తప్పకుండా మరో చిత్రంతో థియేటర్లలో వినోదం పంచుతా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, శ్రీకాంత్‌ అడ్డాల, కార్తీక్‌ రత్నం, రచ్చ రవి తదితరులు పాల్గొని ప్రేక్షకులకి థ్యాంక్స్‌ చెప్పారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘వెంకటేశ్‌ మాస్‌ చిత్రాలు చేయగలరు.. క్లాస్‌ చిత్రాలూ చేయగలరు’ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని