Vishwak Sen: ‘పాగల్‌’ కాంబో మరోసారి.. కొత్త చిత్రం టైటిల్‌ ఇదే!

విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ జంటగా దర్శకుడు నరేశ్‌ కుప్పిలి తెరకెక్కించిన చిత్రం ‘పాగల్‌’.

Published : 09 Mar 2022 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ జంటగా దర్శకుడు నరేశ్‌ కుప్పిలి తెరకెక్కించిన చిత్రం ‘పాగల్‌’. గతేడాది విడుదలైన ఈ విభిన్న ప్రేమకథా చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘దాస్‌ కా ధమ్కీ’ అనే టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అరవింద్‌ క్లాప్‌కొట్టగా అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. విశ్వక్‌ ప్రస్తుతం.. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని