Karthi: ప్రభువు సృష్టిలో వాడొక హీరో!

కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జపాన్‌’. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 26 May 2023 14:50 IST

కార్తి (Karthi) కథానాయకుడిగా రాజు మురుగన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జపాన్‌’ (Japan). ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం కార్తి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘వాడు పాప క్షమాపణకు అతీతుడు ఫాదర్‌. ప్రభువు యొక్క అద్భుతమైన సృష్టిలో వాడొక హీరో’’ అంటూ కార్తి పాత్రను పరిచయం చేస్తూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కార్తి ఇందులో జపాన్‌ అనే విభిన్నమైన పాత్ర పోషించారు. అతన్ని కొందరు హీరో అంటే మరికొందరు కమెడియన్‌, విలన్‌గా వర్ణించడం ప్రచార చిత్రంలో కనిపించింది. ఆఖర్లో ‘‘జపాన్‌ మేడిన్‌ ఇండియా’’ అంటూ కార్తి తనని తాను పరిచయం చేసుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.రవి వర్మన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని