టీటీఏ ఆధ్వర్యంలో చికాగోలో దసరా.. దీపావళి వేడుకలు

ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)ఆధ్వర్యంలో చికాగోలోని స్థానిక ‘హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో’లో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22న టీటీఏ అధ్యక్షుడు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా జరిపారు.

Published : 24 Oct 2022 21:52 IST

చికాగో: ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)ఆధ్వర్యంలో చికాగోలోని స్థానిక ‘హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో’లో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22న టీటీఏ అధ్యక్షుడు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా జరిపారు. అమెరికన్‌ హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌ సభ్యులు బిల్ ఫాస్టర్, రాజా కృష్ణమూర్తి, తానా సభ్యులు, ఏటీఏ సభ్యులు, సీఏఏ అధ్యక్షుడు ఈ ఉత్సవాలకు అతిథులుగా హాజరయ్యారు.

చిరంజీవులు ఆదర్శ ఆకుల, వరుణ్ వాసిరెడ్డి, తనుష్ సింగ్‌లు ఆలపించిన భక్తి గీతంతో వేడుకలు ప్రారంభించారు. దాదాపు 500పైగా సభ్యులు వేడుకలకు హాజరయ్యారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంగీత, నాట్య కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. శోభా తమన్న, జానకి అయ్యర్, సౌమ్య కుమరన్, శిల్పా బజ్జూరిలు తమ విద్యార్థి బృందాలతో కలిసి ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కిరణ్ చౌహాన్, బిందు పతక్.. ప్రదర్శించిన కథక్ నృత్య రీతి అందరి మన్ననలు అందుకుంది. భక్తి గీతాలతో రమ్య తిన్నియం, షీలా బృందం.. భవ్య బెహతా, చక్కటి శాస్త్రీయ నృత్యాలతో అనురాధ శివరాం, రంజిత రాయ్ చౌదరిల బృందం.. పూజ జోషి, నీతు, ప్రియా సెంథిల్, శిల్పా శరబుల ప్రదర్శించిన చలనచిత్ర గీత నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

స్వప్న పూల సహకారంతో రేఖా వేమూరి, ప్రణతి కలిగొట్ల కలిసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. హేమంత్ పప్పు సహకారంతో సోమలత ఎనమందల, సుష్మిత గన్ రెడ్డి, మిథున్ ఎనమందల చేసిన వేదిక అలంకరణ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. జగదీశ్ కానూరి, గురుస్వామి, రామకృష్ణ కొర్రపోలు, శ్రీనాథ్ వాసిరెడ్డి, దిలీప్ రాయలపూడి, వీరాస్వామి అచంట, అపర్ణ అయ్యలరాజు, చాందిని దువ్వూరి, రవి వేమూరి, అర్చన మిట్ట, శిల్ప మచ్చ, భాను సిరమ్, గుప్తా నాగుబండి, ప్రశాంతి తాడేపల్లి, రామకృష్ణ తాడేపల్లి, సందీప్ గడ్డం, సతీష్ మచ్చ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో తోడ్పాటును అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని