
సరదాగా నా కొడుకు బెంజ్‌కారు నడిపాడు!
తప్పుడు ప్రచారం మానుకోవాలన్న మంత్రి జయరాం
అమరావతి: బెంజ్ కారు నడిపినంత మాత్రాన ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు అడిగాడు కాబట్టే సరదాగా ఆ కారు నడిపాడని జయరాం వివరించారు. బెంజ్ కారు బహుమానంగా ఇచ్చారంటూ తనపై అభియోగం మోపుతున్నారనీ.. 2019 డిసెంబర్‌లో కార్తీక్ కారు కొన్నాడని తెలిపారు. కానీ ఈ కేసు నమోదైంది 2020 జూన్‌లో అని చెప్పారు. బెంజ్‌కారు నడిపినంత మాత్రాన కుంభకోణంలో ఉన్నట్టేనా?అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని అయ్యన్నకు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.