Balakrishna: జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండండి: బాలకృష్ణ

నంద్యాల జిల్లా నందికొట్కూరులో హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 15 Apr 2024 22:38 IST

నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరులో హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. బాలకృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. రూ. 100ల కోట్ల ప్రభుత్వ ధనంతో వైకాపా ‘ సిద్ధం’ సభలు నిర్వహిస్తోందని బాలకృష్ణ విమర్శించారు. జగన్‌ పాలనతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని