Kishan reddy: కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే పెండింగ్‌లో ఎంఎంటీఎస్‌ పనులు: కిషన్‌రెడ్డి

బంగారు తెలంగాణను పక్కనపెట్టి.. బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారని సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కుట్రలు చేసి భాజపాను అణచివేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 07 Apr 2023 15:25 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణను నవ్వులపాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణను పక్కనపెట్టి.. బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రధాని మోదీ సెలవు తీసుకోలేదని.. కేసీఆర్‌ మాత్రం 9 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కుట్రలు చేసి భాజపాను అణచివేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ప్రజలు గమనించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని