CM KCR: పెద్ద రాష్ట్రాలను తలదన్ని అగ్రస్థానంలో నిలిచాం: సీఎం కేసీఆర్‌

అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

Published : 23 Aug 2023 16:44 IST

మెదక్‌: అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘ తెలంగాణ రాకముందు పరిపాలన చేతకాదని విమర్శించారు. పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శనం. దేశం, రాష్ట్రం, జిల్లా, పట్టణం ఏ స్థాయిలో ఉందని తెలుసుకునేందుకు డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ ఉంటుంది. 70..75 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకను కూడా అధిగమించి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

విద్యుత్‌ వినియోగంలో కూడా భారత దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్ని రంగాలకు నాణ్యమైన 24గంటల విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పింఛను రూ.3వేల నుంచి రూ.4,016కు పెంచుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతి సాధించి మరింత పెంచుకుంటాం. తెలంగాణ రాకముందు 24 లక్షల పింఛన్లు మాత్రమే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని