Stalin : ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు : స్టాలిన్‌

ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ (Stalin) ఆరోపించారు. దేశాన్ని నాశనం చేసే ప్రయత్నాలను ప్రజలంతా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

Published : 09 Sep 2023 01:57 IST

చెన్నై : ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi)  రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయాన్ని ప్రజలు గుర్తించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) అన్నారు. చెన్నైలో నిర్వహించిన  ‘మీడియా మీట్‌’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను పరిరక్షిస్తానని ప్రధాని ప్రమాణం చేశారు. కానీ, ఆయన చేతలు రాజ్యంగానికి విరుద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మన దేశాన్ని నాశనం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. తమిళనాడు, కేరళ ప్రజలు ఐక్యంగా ఉండి దేశాన్ని రక్షించే పోరాటానికి నాయకత్వం వహిస్తారని నేను విశ్వసిస్తున్నా. కొత్త ఉదయాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నా. ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. అధికార పక్షం చెప్పే అబద్ధాలు, వ్యూహాలను మీడియా ప్రసారం చేయొద్దు’’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. 

మతం, రాజకీయాలు వేర్వేరు.. కలిపి చూడాల్సిన అవసరం లేదు: ఖర్గే

ఇటీవల స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దాంతో భాజపా, పలు హిందూ సంఘాలు ఉదయనిధిపై విమర్శల దాడి చేశాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం భారత దేశ వైవిధ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. ఏ ఆదర్శాలపై ఈ దేశం నిలదొక్కుకుందో వాటిని భాజపా నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో ఆ దాడిని ఖండిస్తున్నప్పుడు.. మీడియా సైతం దేశాన్ని రక్షించడంతో కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని