Daggubati Purandeswari: సర్పంచ్‌లు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యల పాపం జగన్‌దే: పురందేశ్వరి

ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్‌ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని భాజపా ఆరోపించింది.

Updated : 10 Aug 2023 16:57 IST

ఒంగోలు: ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్‌ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని భాజపా ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ధర్నాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర నేతలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారని చెప్పారు. అప్పులు తీర్చలేక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారని.. ఈ పాపం సీఎం జగన్‌ ప్రభుత్వానిదేనని విమర్శించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపై మాట్లాడే జగన్‌.. ఏనాడైనా సర్పంచ్‌ల సమస్యలపై మాట్లాడారా? అని పురందేశ్వరి నిలదీశారు. సర్పంచ్‌ల వ్యవస్థను ఆయన అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని