Sanjay Raut: అందుకే క్రికెట్‌ మొత్తాన్ని అహ్మదాబాద్‌కు తరలించేశారు.. రౌత్‌ ఆరోపణ

భాజపా రాజకీయాల వల్లే క్రికెట్‌ మొత్తం ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తరలిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

Updated : 19 Nov 2023 21:09 IST

ముంబయి:  అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపానుద్దేశించి ఆయన తనదైన శైలిలో విమర్శించారు. భాజపా రాజకీయాల వల్లే క్రికెట్‌ ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తరలిపోతోందన్నారు. క్రికెట్‌ను భాజపా ఓ రాజకీయ కార్యక్రమంలా నిర్వహించాలనుకుంటోందని ఆరోపించిన రౌత్‌.. క్రికెట్‌కు సంప్రదాయ పవర్‌ హౌస్‌గా ఉన్న ముంబయి నగరం నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తరలించారని ఆరోపించారు.  

‘వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఇంతకముందు క్రికెట్‌కు ముంబయి కేంద్రంగా ఉండేది. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దిల్లీ, ముంబయి లేదా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగేవి. క్రికెట్‌ను పొలిటికల్‌ ఈవెంట్‌లా నిర్వహించాలని భాజపా భావించడం వల్ల మొత్తం క్రికెట్‌ను ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. భాజపా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరుకు క్రికెట్‌ను సైతం వదిలిపెట్టడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. 

టోంక్‌పై మరోసారి ‘పైలట్‌’ గురి.. స్థానికతే భాజపా అస్త్రం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం. దాదాపు 1.32లక్షల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌ను వీక్షించేలా నిర్మించారు. ప్రస్తుతం భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగానే వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని