ఇతర పార్టీల్లో చేరొచ్చు: టీమ్‌ రజనీకాంత్‌

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ఏర్పాటు ఆలోచన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ మక్కళ్‌మండ్రం సభ్యులు ఇతర పార్టీల్లో నిరభ్యరంతంగా చేరొచ్చని టీమ్‌ రజనీ వెల్లడించారు.

Updated : 18 Jan 2021 14:54 IST

చెన్నై: ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ఏర్పాటు ఆలోచన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ మక్కళ్‌మండ్రం సభ్యులు ఇతర పార్టీల్లో నిరభ్యరంతంగా చేరొచ్చని టీమ్‌ రజనీ వెల్లడించింది. సోమవారం కొందరు రజనీ మక్కళ్ మండ్రం జిల్లా అధ్యక్షులు తమిళనాడు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీలో చేరడంతో రజనీ బృందం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇతర పార్టీల్లో చేరినప్పటికీ వారు రజనీ అభిమానులేనన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు.’’ అని రజనీ అభిమానుల వేదిక పేర్కొంది. కొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్‌ భాజపాకు తన మద్దతునిస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

త డిసెంబరు నెలలో రజనీ తన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైన తరుణంలో అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించారు. ‘‘రాజకీయాల్లోకి రావొద్దని దైవం నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. నేను రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు నా సేవలను అందిస్తాను.’’ అని రజనీ వెల్లడించారు. దీంతో రజనీ అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. మరోవైపు తమిళనాడు భాజపా అధ్యక్షుడు సీటీ రవి రజనీ మద్దతు కోరుతూ ఆయన్ను కలుస్తానని వెల్లడించారు. ‘‘ రజనీ ఎప్పుడూ దేశం, తమిళనాడు అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తారు.  ఆయన గొప్ప నాయకుడు. ప్రధాని మోదీకి ఎంత ఆత్మీయుడో మనకు తెలిసిందే.’’ అని సీటీ రవి తెలిపారు.

ఇవీ చదవండి..

పటిష్ఠ పహారాలో అమెరికా..

సంక్షేమ పాలనకు ఎన్టీఆర్‌ ఆద్యుడు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని