ఏలూరు జిల్లాలో జనసేనాని.. కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.

Updated : 23 Apr 2022 17:28 IST

ఏలూరు: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ‘జనసేన కౌలు భరోసా యాత్ర’లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేసి.. కౌలు రైతు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. తర్వాత జానంపేటలో మరో రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకముందు పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు, జన సైనికకులు భారీగా తరలివచ్చారు. గజమాలతో జనసేనానికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో దుగ్గిరాల వద్ద పవన్‌ కల్యాణ్‌ను అనుసరిస్తున్న బైక్‌ను కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయలవ్వగా అతడిని ఆస్పత్రికి తరలించారు. 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్‌ సాయం అందించనున్నారు. విజయవాడ నుంచి జానంపేట మీదుగా చింతలపూడి రహదారిలో.. పెదవేగి మండలం విజయరాయి, లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, లింగపాలెం ప్రాంతాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి అనంతరం రచ్చబండలో పవన్‌ పాల్గొననున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని