Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్‌ చేశారు.

Published : 19 Mar 2024 14:52 IST

హైదరాబాద్‌: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్‌ చేశారు. గత మూడురోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ సర్కారుకు కేవలం రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్టు చేశారు.  

‘‘గతంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్‌ ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇచ్చారు. వడగళ్ల వానతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలి. వర్షంతో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి సహా మరికొన్ని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు