India Alliance: ఒంటరి పోటీపై ప్రకటన చేయండి.. ఇండియా కూటమి పార్టీలను కోరిన కాంగ్రెస్‌

ఇండియా కూటమిలోని పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే దానిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ కోరింది. 

Published : 31 Jan 2024 13:24 IST

కతిహార్‌: సార్వత్రిక ఎన్నికలు (LokSabha Elections 2024) సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు విషయంలో ‘ఇండియా కూటమి (INDIA Alliance) పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ (TMC), పంజాబ్‌లో ఆప్‌ (AAP)లు ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు కూటమికి షాకిస్తూ.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఎన్‌డీయేతో జట్టు కట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్‌ (Congress) కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఇప్పటివరకు కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలన్నీ ఒకే గొంతుక వినిపించాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే.. దానిపై ప్రకటన చేయాలి. పశ్చిమబెంగాల్‌లో కూడా కూటమి కలిసి పోరాడుతుందని భావిస్తున్నాం’’ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. 

నేను బతికున్నంతవరకు బెంగాల్లో సీఏఏ అమలు కానివ్వను: మమత

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయడంతో కూటమి పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ ముందుకు రాకపోవడంతో కూటమి నుంచి పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని